మెగా అభిమానులు ఇప్పుడు హ్యాపీనా..వాళ్లే గెలిచారు
on May 22, 2025

నాంది, ఉగ్రం వంటి విభిన్నమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించిన దర్శకుడు విజయ్ కనకమేడల(Vijay Kanakamedala)ఈ నెల 30 న బెల్లంకొండ సాయిశ్రీనివాస్(Bellamkonda sai srinivas),మంచు మనోజ్(Manchu Manoj),నారా రోహిత్(Nara Rohith)లతో తెరకెక్కించిన 'భైరవం'(Bhairavam)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీపై ట్రైలర్ రిలీజ్ తో అందరిలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా విజయ్ కనకమేడలపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు చిరంజీవి(Chiranjeevi)రామ్ చరణ్(Ram Charan)పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ని విమర్శిస్తు విజయ్ తన ఫేస్‌బుక్ అకౌంట్ లో కొన్ని పిక్స్ షేర్ చేసాడని, కాబట్టి 'భైరవం' ని బహిష్కరించాలంటు మెగా అభిమానులు పోస్టులు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ విషయంపై విజయ్ స్పందిస్తు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి గుడ్ ఈవెనింగ్. మే 18న 'భైరవం' ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు నుంచి మెగా అభిమానులు నాకు సపోర్ట్ గా ఉన్నారు. 2011లో మెగా హీరోలని విమర్శిస్తు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేసానని,మెగా అభిమానుల వైపు నుంచి ట్రోల్ జరుగుతుంది. అది నేను పెట్టిన పోస్ట్ కాదు. నేను అందరు హీరోలతో పని చేశాను. కానీ ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. కాబట్టి వాళ్ళతో నాకు మంచి అనుబంధం ఉంది. గబ్బర్ సింగ్ మూవీకి పని చేస్తున్నప్పుడు కళ్యాణ్ బాగా సపోర్ట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ ని పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటాను. చాలా మంది లాగానే నేను కూడా మెగా స్టార్ పవర్ స్టార్ సినిమాలు చూసి డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను.
అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను. నా ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యింది. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా, ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు.. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. మెగా అభిమానులకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానని అని విజయ్ ఎక్స్ వేదికగా తెలిపాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



