ది రాజాసాబ్ టీజర్ పై బేబీ నిర్మాత కీలక వ్యాఖ్యలు
on May 23, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)హర్రర్ కామెడీ గా తెరక్కుతున్న ఈ మూవీకి మారుతీ(Maruthi)దర్శకుడు కాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజె విశ్వప్రసాద్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్(Nidhhi agewal)మాళవికా మోహనన్(Malavika Mohanan)జత కడుతుండగా సంజయ్ దత్, రిది కుమార్, మురళి శర్మ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
రీసెంట్ గా ప్రముఖ బేబీ సినిమా నిర్మాత ఎస్ కె ఎన్ ఒక మీడియా సమావేశంలో రాజా సాబ్ గురించి మాట్లాడుతు మారుతీ తో రీసెంట్ గానే మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం రాజా సాబ్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఈ రెండు వారాల్లోనే టీజర్ రాబోతుందని చెప్పాడు. నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో రాజాసాబ్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎస్ కె ఎన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వస్తుండంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
ఇక ఇప్పటికే రాజాసాబ్ నుంచి ప్రభాస్ కి సంబంధించిన రెండు లుక్స్ రిలీజ్ అయ్యాయి. అందులో ఒక లుక్ లో లవర్ బాయ్ లాగా ఉండగా, రెండో లుక్ లో ఓల్డ్ గెటప్ తో కనపడ్డాడు. దీంతో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీజర్ లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



