రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్....ఎంతో తెలుసా?

 

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా,  దీపావళి పండుగ సందర్బంగా  గ్రూప్‌ C, గ్రూప్‌ D ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. ఈ బోనస్ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,866 కోట్లను కేటాయించింది. గ్రూప్‌ D (లెవెల్‌ 1 స్టాఫ్‌) ఉద్యోగులకు ఈ బోనస్‌ వర్తించనుంది. 

అలాగే, రైల్వే ప్రొడక్షన్ యూనిట్లు, రైల్వే వర్క్‌షాపులు, ఇతర సహాయ విభాగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ బోనస్‌ అందనుంది. ప్రతి సంవత్సరంలా, ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల కోసం పండుగ బోనస్‌ను ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu