బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
posted on Sep 24, 2025 4:21PM
.webp)
బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ పిటీ షన్ దాఖలు చేసిన పిటీషనర్ పై హైకోర్టు సీరియస్ అయింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ మేరకు హైకోర్టులో విచారణ జరిగింది. నేడు కోర్టు బీసీ రిజర్వేషన్ పిటిషన్ దాఖలు చేసిన పిటి షనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషనర్ అర్హతను ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా కాపీ ఇచ్చిందా?అని హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. కేవలం పేపర్ క్లిప్పింగ్స్ లో వచ్చిన ఆర్టికల్స్ లను ఆధారంగా చేసు కుని ఎలా పిటిషన్ వేస్తారు అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పేపర్ క్లిప్పింగ్స్ లో వచ్చిన ఆర్టికల్స్ ను బేస్ చేసుకొని పిటీషన్ వేయడం సరికాదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏ ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వలు పిటిషన్ దాఖలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతోపాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు