మెస్సీతో ఫొటో దిగాలంటే..?

హైదరాబాద్ మహానగరం ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మానియాతో ఊగిపోతోంది. లియోనెల్ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్ బ్యాల్ మ్యాచ్ ఆడతారు. అలాగే అదే రోజు ఫలక్ నూమా ప్యాలెస్ లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంతకీ మెస్సీ హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటే?  గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా లెస్సీ భారత్ లోని నాలుగు ప్రధాన నగరాలలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ రానున్నారు. ఇంతకీ గోట్ అంటే ఏమిటి అంటారా  గోట్ అంటే గ్రేటెస్ట్ ప్లేయర్ ఆప్ ఆల్ టైమ్. 

అదలా ఉంచితే గోట్ నిర్వాహకురాలు స్వాతి రెడ్డి మెస్సీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. అదేంటంటే మెస్సీ ఫలక్ నూమా ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో అభిమానులు ఆయనతో ఫొటో దిగేందుకు అవకాశమిస్తారు. మెస్సీ అభిమానులకు ఇది నిజంగా ఎగిరి గంతేసే వార్తే. అయితే మెస్సీతో ఫొటో దిగాలంటే దాదాపు పది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అలా చెల్లించగలిగిన వంద మందికి మెస్సీతో ఫొటో దిగే చాన్స్ లభిస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu