అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దారుణ హత్య
posted on Oct 4, 2025 4:55PM

అమెరికాలోని టెక్సాస్ లో గుర్తు తెలియని ఓ వ్యక్తి జరిపిన కాల్పులలో తెలుగు యువకుడు మృతి చెందాడు. దీంతో ఆ యువ కుడి ఇంట్లో విషాదఛా యలు అలుముకున్నాయి. ఎల్బీనగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పోలే జగన్ మోహన్ కుమారుడు పోలే చంద్రశేఖర్(27)... ఇతను 2023లో అమెరికాలోని టెక్సాస్ లో డెంటల్ సర్జరీ లో మాస్టర్స్ చదువుకోడానికి వెళ్ళాడు. చంద్రశేఖర్ డెల్టన్ లో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు.
అయితే ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో గుర్తు తెలియని నల్ల జాతీయుడు తన వాహనంలో గ్యాస్ నింపుకోవడానికి వచ్చి ఒక్కసారిగా చంద్రశేఖర్ పై కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. ఈ కాల్పుల దాడిలో చంద్రశేఖర్ అక్కడి కక్కడే మృతి చెందాడు. సమా చారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చంద్రశేఖర్ మృతదేహాన్ని హాస్పిటల్ కి తర లించారు.. కొడుకు మరణించాడన్న వార్త వినగానే తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరియు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో కలిసి మృతుడి తండ్రి జగన్ మోహన్ ఇంటికి వెళ్లి సంతాపం తెలియజేశారు . తన కొడుకు మృతదేహాన్ని ఇండియాకి తీసుకు వచ్చేందుకు సహా యం చేయాలని హరీష్ రావును కోరారు. వీలైనంత త్వరగా మృతదే హాన్ని భారతదే శానికి తీసుకువస్తా మని మాజీ మంత్రి హామీ ఇచ్చారు.