ఇక పీఎంవో పేరు సేవాతీర్థ్‌గా మార్పు
posted on Dec 2, 2025 3:56PM

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంవో( ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్) పేరును సేవాతీర్థ్‌గా మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాలుగా సౌత్‌బ్లాక్‌లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా.. ఆ కార్యాలయం నూతన భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే పేరు మార్పుపై ప్రకటన వచ్చింది. ఇప్పటికే గవర్నర్ల అధికారిక నివాసం రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిన విషయం తెలిసిందే.
ఇక రాజ్ భవన్‌ల పేరు మార్పు ఉత్తర్వులు అందగానే వెంటనే పశ్చిమ బెంగాల్, త్రిపురా, కేరళ, తమిళనాడు, అస్సాం తదితర రాష్ట్రాలు డిసెంబర్ 1 నుంచి సైన్‌బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లు, లెటర్‌హెడ్‌లు మార్చేశాయి. ఇదిలా ఉండగా.. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మాత్రం కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.