కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట : సీఎం రేవంత్‌

 

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఆకలి కేకలు చూసి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ పెట్టాలని అప్పటి ప్రధాని నెహ్రు వారి వల్లనే సాధ్యమైందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు శ్రీశైలం, ఎస్సారెస్పీ మొదలగు అన్ని నెహ్రు ప్రారంభించనవేని రేవంత్ స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కీలక శాఖల్లో ఉండటం వల్లనే ఇక్కడ అభివృద్ధి వేగంగా అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 

సర్పంచ్‌లు మంచి వ్యక్తిని ఎన్నుకొండి అభివృద్ధి చేసే వాళ్లనే సర్పంచ్ లను చేయండని సీఎం పిలుపునిచ్చారు. భట్టి, తుమ్మల, పొంగులేటి ఏది అడిగినా ఇచ్చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడింది ఇక్కడే అని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం మీరంతా ఓట్లేసి గెలిపిస్తేనే.. ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాం. మంచి ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఫ్రీ కరెంట్‌, రేషన్‌ కార్డులు వస్తాయి. గ్రామాల్లో సర్పంచ్‌లు కూడా మంచోళ్లు ఉండాలి. మంత్రులతో కలిసి పనిచేసే మంచి సర్పంచి మీ ఊళ్లో లేకపోతే.. గ్రామాలు దెబ్బతింటాయిని సీఎం రేవంత్ తెలిపారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu