అమరావతి కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్
posted on Dec 2, 2025 2:51PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ కోసం మంగళవారం (డిసెంబర్ 2) నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో మొత్తం 16,666 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి, తుళ్లూరు మండలాలలోని గ్రామాలలో ఈ ల్యాండ్ పూలింగ్ జరగనుంది.
అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఏండ్రాయి, కర్లపూడి, లెమల్లె గ్రామాల్లో 7,465 ఎకరాలు, తుళ్లూరు మండలంలోని వడ్లమాను, హారిచంద్రపురం, పెద్ద పరిమి గ్రామాలలో 9,097 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ కింద భూ సమీకరణ చేయనున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలన్న ప్రతిపాదనకు గత వారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.