జీడిమెట్లలో అర్ధరాత్రి యువతి హంగామా

 

పీకలదాకా మద్యం సేవించిన ఓ మహిళ మాది ఆంధ్ర.. అంటూ తొడ కొడుతూ రోడ్డు మీద హంగామా సృష్టించిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువతి నిన్న అర్ధరాత్రి సమయంలో రహదారిపై వెళ్తున్న వాహనదారులు, పాదచారులను దుర్బాష లాడుతూ  హంగామా సృష్టించడంతో అక్కడ ఉద్రిక్తత  వాతావరణం నెలకొంది. 

ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమీపంలో ఉన్న స్థానికులు పరిస్థితిని గమనించి వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువతి ఇదంతా అడవి... డబ్బుంటే అన్ని ఉంటాయి. అందుకే కేసీఆర్ నేను ఉన్ననని చెప్పాడు.. కేసీఆర్, జగన్ ఇద్దరు మంచోళ్ళు... నాకు కేసీఆర్ కావాలి... ఒక నెలలో ఈ కాంగ్రెస్ పార్టీ పోయి కేసీఆర్ వస్తాడు. 

కేసీఆర్ కోసం మగవాళ్ళు మాత్రమే  చేస్తారని అంటున్నారు కదా ఇప్పుడు నేను వచ్చారు.. నాది ఆంధ్ర అంటూ తొడగొడుతూ.. నేను విజయవాడ తాడేపల్లి కి చెందిన మహిళను.. మా జగన్ మామ హీరో.... ఆంధ్రాలో జగన్... తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు సూపర్... కెసిఆర్ కోసం వచ్చాను అంటూ పోలీసులతో ఏదేదో మాట్లా డుతూ నడిరోడ్డు మీద నానా రచ్చ రచ్చ చేసింది. 

అంతసేపు పోలీసులు చాలా ఓపికగా ఆమెతో మాట్లా డడంతో ఆమె పరిస్థితి వారికి అర్థమైంది. ఆమె అస్వస్థత ను గమనించిన పోలీసులు, మెరుగైన వైద్యసాయం అందించేం దుకు 108 అంబులెన్స్‌కు సమాచా రమిచ్చారు.తరువాత ఆమెను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu