రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐపీఎస్ సునీల్ కుమార్ కు నోటీసులు

వైసీపీ హయాంలో రఘురామకృష్ణంరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పట్లో వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజుపై వైసీపీ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరించింది. ఇప్పుడు రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సంగతి తెలిసిందే.  గతంలో తనపై కస్టడీలో దాడి చేసిన వారిపై కూటమి సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని రఘురామకృష్ణం రాజు పలు సందర్భాలలో తన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రస్తుతంలోకి వస్తే  రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు ఆ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందాయి. 

వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ సీఐడీ ఛీఫ్ గా పని చేశారు. అప్పట్లో రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగా ఉన్నారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి వైసీపీ ప్రభుత్వ తప్పి దాలను ఎత్తి చూపేవారు. ఆ క్రమంలోనే ఆయన్ను నియంత్రించేందుకు  జగన్ సర్కార్ రఘురా మకృష్ణంరాజుపై రాజద్రోహం ఆరోపణలతో కేసు నమోదు చేయించి అరెస్టు చేసింది. అనంతరం గుంటూరు సీఐడీ కస్టడీలో రఘురామరాజును టార్చర్ చేశారు.  అప్పట్లో గుంటూరు ప్రభుత్వాస్పత్రి రఘురామరాజు శరీరంపై ఎటువంటి గాయాలూ లేవనీ, ఆయనపై కస్టోడియల్ టార్చర్ జరగలేదనీ రిపోర్టు ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన రఘురామకృష్ణం రాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో మరోసారి పరీక్షలు చేయించుకునేందుకు అనుమతి తెచ్చుకున్నారు. సికిందరాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షల్లో రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని తేలింది.

 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధకారంలోకి వచ్చింది. రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ మాత్రం నత్తనడకనే కొనసాగుతోంది. ఈ కేసులో ఇంత కాలానికి కీలక పరిణామం చోటు చేసుకుంది. రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు గుంటూరు పోలీసులు నోటీసులు పంపి.. డిసెంబర్ 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu