వైట్ హౌస్ సమీపంలో కాల్పులు.. భద్రత కట్టుదిట్టం
posted on Nov 27, 2025 9:18AM

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు అత్యంత సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్ర దాడిగా అభివర్ణించారు. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తక్షణమే అదనంగా 500 మంది సైనికులను పంపాలని పెంటగాన్‌ను ఆదేశించారు.
వైట్ హౌస్ వద్ద గస్తీ కాస్తున్న వెస్ట్ వర్జీనియాకు చెందిన నేషనల్ గార్డ్ సైనికులపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనతో భద్రతా దళాలు వెంటనే వైట్‌హౌస్ కాంప్లెక్స్‌ను లాక్‌డౌన్ చేశాయి. అలాగే భద్రతా దళాలు దుండగుడిని అదుపులోనికి తీసుకున్నారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని ఆఫ్ఘనిస్థాన్ కు రెహమానుల్లాలకన్వాలాగు గుర్తించారు.
అంతే కాకుండా అమెరికా సైన్యానికి సహాయం చేసిన అఫ్ఘన్లకు ఇచ్చే ప్రత్యేక వీసాపై వచ్చిన ఇతడు, వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలోనే ఉంటున్నట్లు తేలింది.ఈ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బైడెన్ హయాంలో ఆఫ్ఘన్ నుంచి వచ్చిన శరణార్థులందరి వివరాలను పునఃపరిశీలించాలన్నారు.