మరోసారి పోలీసు కస్టడీకి ఐ బొమ్మ రవి

ఐబొమ్మ రవిని మరో సారి పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు గురువారం (వంబర్ 27) ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పోలీసులు ఐబొమ్మ రవిని అదుపులోనికి తీసుకుని విచారించనున్నారు. గురువారం (నవంబర్ 27) నుంచి శనివారం (నవంబర్ 29) వరకూ రవిని విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే తొలి సారి ఐదు రోుల కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు ఇప్పుడు పైరసీకి సంబంధించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు మూడు రోజులు విచారించనున్నారు.  

గతంలో  ఐదు రోజుల పాటు జరిగిన విచారణకు ఐబొమ్మ రవి తమ ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడని, కొన్నిటికి అసలు జవాబే ఇవ్వలేదనీ, అందుకే మరోసారి అతనిని కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ   సైబర్ క్రైమ్ పోలీసులు  నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు ఐబొమ్మ రవిని మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ విచారణలో పోలీసుల   ప్రధానంగా ఐబొమ్మ రవి నెట్‌వర్క్‌, అతడితో కలసి పనిచేస్తున్న వ్యక్తులు, ఐపీ అడ్రస్ మాస్కింగ్‌ ద్వారా తప్పించు కుంటున్న నేరగాళ్లపై సమాచారం రాబట్టనుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu