పాఠ్యాంశాలలో మళ్లీ నైతిక శాస్త్రం.. మంత్రి లోకేష్ ను ప్రశంసించిన నారా భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం సంతోషంగా ఉందని నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా సమగుట్ట పల్లిలోని విలువల బడిని ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆ పాఠశాల విద్యార్థులతో మమేకమయ్యారు.  ఈ సందర్భంగా విలువల బడి వ్యవస్థాపకుడు లెనిల్ ను అభినందించారు.  విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పించి బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడులను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను అభినందించారు.

తన చిన్నతనంలో  స్కూల్లో  నైతిక శాస్త్రం   ఒక పాఠ్యాంశంగా ఉండేదని గుర్తు చేసుకున్న ఆమె ఇప్పుడు రాష్ట్రపాఠశాలల్లో మోరల్ సైన్స్ సబ్జెక్ట్ ను తీసుకువచ్చినందరకు లోకేష్ ను అభినందిస్తున్నాన్నారు.   రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డులు పెట్టడం చాలా సంతోషమన్న నారా భువనేశ్వరి నేటి సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. పిల్లలలో నైతిక విలువల పట్ల అవగాహన పెంపొందించే విషయంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలన్నారు.  తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తిని గమనించి  అందుకు అనుగుణంగా పిల్లల ఎదుగుదలకు దోహదపడాలన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu