మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి ఐబొమ్మ రవి
posted on Dec 5, 2025 4:07PM
.webp)
ఐబొమ్మ రవిని మరో మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో పోలీసుల దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై విచారించిన కోర్టు.. మూడు కేసులలో కేసుకు ఒక రోజు చొప్పున ఐబొమ్మ రవిని పోలీసుల కస్టడీకి అనుమతించింది. పోలీసులు మొత్తం నాలుగు కేసులలో ఐబోమ్మ రవి కస్టడీని కోరగా, కోర్టు మాత్రం మూడు కేసులలోనే కస్టడీకి అనుమతించింది.
మరో కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో సైబర్ క్రైం పోలీసులు శనివారం (డిసెంబర్ 6) నుంచి మూడు రోజుల పాటు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవిని సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం (డిసెంబర్ 6) కస్టడీలోకి తీసుకోనున్నారు. అదలా ఉంటే ఐబొమ్మ రవి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం విచారించనుంది.