ఏపీలో ఎస్‌ఐఆర్ చేపట్టాలి ...టీడీపీ ఎంపీ పిలుపు
posted on Nov 30, 2025 3:28PM

కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సిల్ రివిజన్‌ను స్వాగతిస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఏపీలో కూడా ఎస్‌ఐఆర్ చేపట్టాలని ఆయన అన్నారు. పార్లమెంట్ శీతకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి ఆయన హాజరయ్యారు. మరోవైపు పన్నెండు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియను ఏడు రోజులు పొడిగిస్తూనట్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్నాది.
ఓటర్లు తమ వివరాలను తనిఖీ చేసుకునేందుకు, అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ముసాయిదా ఎన్నికల జాబితా డిసెంబర్ 9వ తేదీకి బదులుగా డిసెంబర్ 16న విడుదల అవుతుంది. తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 7వ తేదీకి బదులుగా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది.ప్రస్తుతం ఎస్ఐఆర్ రెండో దశ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో జరుగుతోంది.