ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూశా : సీపీఐ నారాయణ

 

ఐబొమ్మలో తాను ఫ్రీగా  సినిమాలు చూశాను అని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేడు వందల రూపాయలు పెట్టి ఎలా మూవీ చూసేది అని నారాయణ అన్నారు.. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలే.. వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారు.. ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడతారని నారాయణ తెలిపారు.

ఒక బొమ్మ రవిని చంపితేనో, జైల్లో వేస్తేనో మరో 100 మంది రవిలు వస్తారని తెలిపారు. ఐ బొమ్మ రవిని ఉరి వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమా మాఫియాను ఉరి తీస్తే సమాజానికి ఉపయోగం ఉంటుందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి టికెట్ ధరల కోసం ఆడుక్కుంటారని అన్నారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సహాయం చేస్తుందా అని నిలదీశారు. కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐ-బొమ్మ రవి దెబ్బ కొట్టారని అన్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu