నెల్లూరు హత్య కేసులో కిలాడీ లేడీ అరెస్ట్

 

నెల్లూరుకు చెందిన సీపీఎం కార్యకర్త పెంచలయ్య హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయి రవాణా, చోరీలు ఇతర నేరాలకు సంబంధించిన ముఠాకు లేడీ డాన్ కామాక్షి లీడర్‌గా ఉంది. ఈ క్రమంలో పెంచలయ్య పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేస్తున్నారనే అనుమానంతో ఈ గ్యాంగ్ హత్య చేయించింది. దీంతో పోలీసులు నిందితురాలు కామాక్షి  నివాసంలో పోలీసులు సోదాలు జరిపి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోని ఆమెను అరెస్ట్ చేశారు. విలువైన భూములకు సంబంధించిన రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు రూరల్ హౌసింగ్ బోర్డు కాలనీలో నివసించే కె. పెంచలయ్య (38) ఎలక్ట్రిషియన్, సీపీఎం నాయకుడు. కాలనీలో జరుగుతున్న గంజాయి విక్రయాలను ఆపాలని, పోలీసులకు సమాచారం ఇస్తూ ఉండేవాడు. అదే అతని ప్రాణాలకు శాపమైంది. శుక్రవారం సాయంత్రం, పిల్లలతో స్కూటీపై ఇంటికి వెళ్తుండగా…తొమ్మిది మంది యువకులు అతడిని అడ్డుకున్నారు.

"మాకే అడ్డువస్తావా?" అంటూ కత్తులతో దారుణంగా దాడి చేశారు.పెంచలయ్య పరుగెత్తి ప్రాణం కాపాడుకోవాలని చూసినా… వెంటపడి పొడిచి చంపేశారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మృతి చెందారు. గంజాయికి వ్యతిరేకంగా పని చేస్తున్న పెంచలయ్యను ముఠా సభ్యులతో కలిసి పెంచలయ్యను కామాక్షి హత్య చేయించినట్లు తెలుస్తోంది.ఇటీవలే రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రియురాలు నిడిగుంట అరుణ  సెటిల్మెంట్ల దందాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే

Online Jyotish
Tone Academy
KidsOne Telugu