తిరుపతి ఎస్పీయూలో చిరుత సంచారం
posted on Nov 26, 2025 10:56AM
.webp)
తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డైంది. తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలోని గ కోళ్ల షెడ్‌పై మంగళవారం నవంబర్ 25) అర్ధరాత్రి చిరుత దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలలో స్పష్టంగా కనిపించాయి.
ఆ తరువాత అక్కడ నుంచి ఎంప్లాయీస్ క్వార్టర్స్ వద్ద కొద్ది సేపు తచ్చాడిన చిరుత.. ఆ తరువాత అక్కడ నుంచి అటవీ ప్రాంతంవైపు వెళ్లిపోయింది. ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారంతో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాగా వర్సిటీ ఆవరణలో చిరుత సంచా రం సమాచారం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
గతంలో కూడా తిరుమల ఘాట్ రోడ్డు, మెట్ల మార్గంలో, ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల మొదటి వారంలో కూడా ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో చిరుతపులి సంచారం కనిపించింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురౌతున్న వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది వర్సిటీ ప్రాంగణంలోకి వన్యప్రాణులు వచ్చే అవకాశంలేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.