గంజాయి డాన్‌ నీతుబాయి ఇంటిపై పోలీసుల దాడి

 

నానక్ రాంగూడలో నివాసం ఉంటున్న నీతుబాయి గంజాయి వ్యాపారం చేయడంలో కింగ్... ఇప్పటికే ఈ లేడీ డాన్ ను పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టారు. అయినా కూడా వీరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు.. మళ్లీ గంజాయి వ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు... అంతే కాదండోయ్ ఈ లేడీ డాన్ కుటుంబ సభ్యులు గంజాయితో పాటు మద్యం కూడా విక్రయాలు చేస్తూ... డబ్బులు సంపాదిస్తున్నారు.

అయితే పోలీసులు గంజాయి విక్రయాలు చేసే ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నానక్‌ రాంగూడలో ఉన్న లేడీ డాన్ నీతూ బాయ్ ఇంట్లో గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్టీఎఫ్‌ బీ-టీమ్‌ పోలీసులు వెళ్ళి ప్రత్యేక దాడులు నిర్వహించారు. టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు, సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు సిబ్బందితో కలిసి నీతు బాయి ఇంటిపై ఆకస్మిక సోదాలు చేశారు. 

ఈ దాడుల్లో 786 గ్రాముల గంజాయి, 110 బీరు బాటిల్స్, బ్రీజర్‌, ఒక బైక్‌, అలాగే గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన రూ. 60,890 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వీరు ఒరిస్సా నుండి గంజాయిని వివిధ పద్ధతుల్లో హైదరాబాదుకు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు తెలిపారు. పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసిన గంజాయి, మద్యం, నగదును షేర్లింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌ అధికారులకు అప్పగించి నట్లు పోలీసులు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu