కొనసాగుతున్న మావోల లొంగుబాటు పర్వం
posted on Nov 27, 2025 3:10PM

మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతున్నది. తాజాగా ఛత్తీస్ గఢ్ లో ఛత్తీస్ గఢ్ లో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఈ మావోయిస్టులపై 1.19 కోట్ల రివార్డులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తున్నది. అలాగే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస విధానం కూడా నక్సల్స్ లొంగుబాటుకు కారణంగా భావిస్తున్నారు.
తాజాగా లొంగిపోయిన మావోయిస్టులలో 12 మంది మహిళలు, బెటాలియన్ నంబర్ 1, వివిధ ఏరియా కమిటీల సభ్యులు, ప్లాటూన్ కంపెనీ, మిలీషియా కమిటీ సభ్యులు ఉన్నారని ఎస్పీ తెలిపారు. అలాగే లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ధమారి, గరియాబంద్, నొవాపాడ డివిజన్ సభ్యులు కూడా ఉన్నారని చెప్పారు.