ఏపీకి అతి భారీ వర్ష సూచన
posted on Nov 27, 2025 2:57PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడనంటున్నాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం (నవంబర్ 27) ఉదయానికి వాయుగుండంగా పరిణామం చెందింది. ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా కదులుతోంది. ఇది మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
శనివారం (నవంబర్30) నాటికి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో శుక్ర, శనివారాల్లో (నవంబర్ 29, 30) ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.