ఖతార్ లో ఉద్యోగావకాశాలు.. మంత్రి ఫరూక్

రాష్ట్రంలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు ఖతార్ దేశంలో  ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పించేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా జాబ్ మేళా, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు  రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  ఎన్ఎండి ఫరూక్ గురువారం (అక్టోబర్ 9) ఒక ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఏపీ ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్  ద్వారా ఖతార్ లోని దోహా లో హోమ్ కేర్ నర్స్  ఉద్యోగాల కొరకు అర్హులైన అభ్యర్డుల నుండి దరఖాస్తులు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

 అర్హులైన మైనారిటీ వర్గాల అభ్యర్థులు  http://naipunyam.ap.gov.in/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. హోమ్ కేర్ నర్స్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే యువతీ యువకుల వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలనీ,   బి.ఎస్సీ లేదా జి.ఎన్.యమ్ నర్సింగ్  విద్యార్హత ఉండి, అనుభవం కూడా ఉండాలన్నారు. ఎంపికైన వారికి  నెలకు రూ. 1.20 లక్షల వేతనంతొ పాటు ఉచిత వసతి,రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి తెలిపారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం   మైనారిటీ వర్గాల అభివృద్దికి కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu