మరియాకు నోబెల్ శాంతి బహుమతి...డొనాల్డ్ ట్రంప్‌కు నిరాశ
posted on Oct 10, 2025 2:53PM

2025కి గాను ప్రతిష్ఠత్మక నోబెల్ శాంతి వెనిజూలకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోకు లభించింది. డెముక్రటిక్ రైట్స్,శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఆమె డిక్టేటర్‌షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వరించలేదు.
నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని రష్యా సమర్థిస్తుందని క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికారి యురి ఉషకోవ్ ప్రకటన చేశారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ టాస్ పేర్కొంది. తన చొరవతో ప్రపంచంలోని పలు దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధాలు ఆగాయని ట్రంప్ పదేపదే ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.