కోచ్ వేధింపులు భరించలేక విద్యార్థిని బలవన్మరణం
posted on Oct 10, 2025 2:38PM
.webp)
సమాజంలో మహిళలు, యువతలు, చివరకు చిన్న పిల్లలకు కామాంధుల నుండి వేధింపులు తప్పడం లేదు. దేవాలయం లాంటి స్కూల్, కాలేజీలలో కూడా కాటు వేసేందుకు కామాంధులు వేచి ఉంటున్నారు. అక్కడ కూడా యువతులు, చిన్నపిల్లలకు సైతం భద్రత లేకుండా పోయింది. ఆడపి ల్లల తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు పంపించాలంటే గజ్జుమని వణుకుతున్నారు. ఓ కామాంధుడి వేధింపులు భరించలేక ఓ విద్యా ర్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్ పరిధిలో నివాస ముంటున్న ప్రమోద్ కుమార్, హరిత అనే దంపతులకు ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు... ప్రమోద్ కుమార్ రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.
మృతురాలు మౌలిక రెండవ సంతానం... మౌలిక సికింద్రాబాద్ పరిధిలోని లాలా గూడలో ఉన్న తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో బిబిఏ సెకండ్ ఇయర్ చదువు తున్నది. అయితే అదే కాలేజీలో అంబాజీ అనే వ్యక్తి వాలీబాల్ కోచ్‌గా పని చేస్తున్నాడు. అంబాజీ విద్యార్థిని మౌలిక పై కన్ను పడింది. దీంతో వాలీబాల్ కోచ్ అంబాజీ ప్రతిరోజు నన్ను ప్రేమించ మంటూ మౌలిక వెంట పడేవాడు.. ప్రేమ మీద నమ్మకం లేని మౌలిక అతని ప్రేమను తిరస్కరించింది. అంతేకాకుండా తన వెంట పడకూడదని పలుమార్లు హెచ్చరించింది.
అయినా కూడా వాలీబాల్ కోచ్ అంబాజీ మౌలిక వెంట పడుతూనే ఉండేవాడు.. రోజురోజుకి అతని వేధింపులు మితిమీరిపోవడంతో తీవ్ర మనస్థా పానికి గురైన మౌలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీ కి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.... నింది తుడు అంబాజీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ దర్యాప్తు ముమ్మరం చేశారు.
మృతురాలి తల్లి హరిత
తన కూతురు చదువుతోపాటు అన్నిట్లో ఫస్ట్ ఉండేదని... క్లాసికల్ డాన్స్ కూడా బాగా చేసేదని తల్లి హరిత కన్నీరు పెట్టుకున్నారు. ఏం జరిగిందో తెలియదు తన కూతురు మామూలుగానే ఉంది మేము బయటికి వెళ్లి వచ్చేసరికి తన కూతురు శవమైం దని బోరున విలపించింది. ఒకరి మీద అనుమానం ఉంది పోలీసులకు ఫిర్యాదు చేసాం అతను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారని మృతురాలు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది...
మృతురాలి అన్న చంద్ర వర్ధన్
కాలేజ్ వాలీబాల్ కోచ్ పై మాకు అనుమానం ఉంది. వాలీబాల్ కోచ్ అంబాజీ నా చెల్లి మౌలికను ప్రతిరోజు వేధింపులకు గురి చేశాడని మా సిస్టర్ ఫ్రెండ్స్ నాతో చెప్పారు. మా చెల్లిని కాలేజీ నుండి తీసుకొని వచ్చాను. అప్పటికే అమ్మా నాన్న చిన్ని చెల్లి చదువుతున్న నారాయణ కాలేజ్ లో మెమో తేవడా నికి వెళ్లారు. మౌలిక, నేను ఇద్దరం కలిసి బజారుకు వెళ్లి సామాన్లు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాం. నేను స్నానానికి వెళ్తున్నానని చెప్పి బాత్రూంలోకి వెళ్లాను. అప్పటికి పెద్ద చెల్లె మౌలిక టీవీ చూస్తుంది. నేను బాత్రూం నుండి బయటికి వచ్చిన తర్వాత రెండు డోర్లు మూసి ఉన్నాయి.
వెంటనే నాకు అనుమానం వచ్చి తలుపులు పగల కొట్టి చూడగా మౌలిక ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో నాకు భయం వేసింది వెంటనే స్థానికంగా ఉన్న అన్నయ్య, చుట్టుపక్కల ఉన్న వారందరినీ పిలిచాను. డాక్టర్ వచ్చి మౌలికను పరిశీలించి అప్పటికే మృతి చెందిందని చెప్పారు... మా నాన్న కోచ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి మౌలిక ఆత్మహత్య చేసు కోవడానికి గల కారణాలను తీసు కుంటామని చెప్పారని మృతు రాలి అన్న తెలిపాడు.