ఛత్తీస్ గఢ్ లో 12 మంది మావోల లొంగుబాటు

నక్సల్స్ విముక్త భారత దేశమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్ చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ జరిగిన పలు ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. అలాగే భారీగా మావోలు ఆయుధాలను విసర్జించి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

అలా లొంగిపోయిన వారిలో  అగ్రనేతలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే   తాజాగా మరో 12 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని   ఛత్తీస్ గఢ్ లోని ఖైరాగఢ్ జిల్లా  కుమ్హీ   గ్రామంలో  12 మంది మావోలు ఆయుధానలతో సహా  లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు  రామ్‌ధేర్ మజ్జీ, డివిజన్ కమిటీ సభ్యులు చందు ఉసేండి, లలిత, జానకీ, ప్రేమ్, ఏరియా కమిటీ సభ్యులు రామ్‌సింగ్ దాదా, సుకేశ్ పొట్టం, ప్లటూన్ పార్టీ మెంబర్లు లక్ష్మి, శీలా, సాగర్, కవత, యోగిత ఉన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu