గోవా అగ్ని ప్రమాదం.. పర్యాటకం పడకేనా?
posted on Dec 8, 2025 1:46PM

అసలే గోవా టూరిజం అంతంత మాత్రం. దానికి తోడు ఇలాంటి అగ్నిప్రమాదాలు కూడా తోడవడంతో మరింత తగ్గుముఖం పట్టేలా కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఫైర్ యాక్సిడెంట్ డీటైల్స్ ఏంటో చూస్తే.. గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పాతిక మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అపూర్వ గ్రామంలో నైట్‌క్లబ్ నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించడం. ఇరుకైన ప్రవేశం మార్గం, తప్పించుకునే దారులు లేకపోవడం, నిర్మాణంలో మండేస్వభావం కలిగిన సామగ్రిని వాడటం వంటివి ప్రమాద కారణాలుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
దీంతో నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాపై బీఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు స్థానిక పోలీసులు. ఇక ఈ నైట్ క్లబ్ కు లైసెన్స్ ఇచ్చిన అర్పోరా-నాగోవా సర్పంచ్ రోషన్ రెడ్కర్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
అసలే గోవా పర్యాటకం అంతంత మాత్రం. ఈ సమయంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ఆ కాస్త టూరిజం కూడా పడకేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అసలింతకీ గోవా టూరిజం ఎందుకు తగ్గిందని ఈ సందర్భంగా ఒక పరిశీలిస్తే.. ధరల పెరుగుదల ఒక ప్రధాన కారణంగా చెబు తున్నారు. దానికి తోడు ఇక్కడికొచ్చే టూరిస్టులపై స్థానిక ఆటో, క్యాబ్ మాఫియా ప్రభావం కూడా ఎక్కువ గానే ఉందని అంటారు. ఇక బీచ్‌లలో పరిశుభ్రత లోపించడం, పర్యాటకులతొ అనుచిత ప్రవర్తన వెరసీ గోవాకు ప్రత్యామ్నయంగా థాయ్ ల్యాండ్ వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు పర్యాటకులు. గోవాను ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో రాష్ట్రప్రభుత్వం దారుణంగా విఫలం చెందడం కూడా గోవాకు పర్యటకుల రాక గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ఇక్కడ ఆటో క్యాబ్ మాఫియా ఆగడాలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువుత్తుతున్నాయి. ఉబర్, ఓలా వంటి చౌకైన యాప్ లు.. అందుబాటులో లేకుండా చేయడం పట్ల కూడా చాలా మంది టూరిస్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక గోవాలో స్థానికుల నిరసన కూడా ఒక కారణంగా తెలుస్తోంది. పర్యాటకుల వల్ల స్థానిక జీవన శైలి బాగా దెబ్బ తింటోందని.. భూముల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని స్థానికులు అసంతృప్తిగా, ఆగ్రహంగా ఉన్నారు. దీంతో వీరు తరచూ ఆందోళనలకు దిగుతున్నారు.
ఇది కూడా గోవా పట్ల పర్యాటకుల విముఖతకు ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, గత 10 ఏళ్లలో విదేశీ పర్యాటకుల దాదాపు సంఖ్య 93శాతం తగ్గింది. అయితే 2025లో దేశ విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు స్థానిక అధికారులు. అయితే ఇది కరోనా ముందు కాలంతో పోలిస్తే చాలా చాలా తక్కువ కరోనాకు ముందు గోవా టూరిజం బ్రహ్మాండంగా ఉండేది. కోవిడ్ తర్వాత విదేశీ పర్యాటకం గణనీయంగా పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ కూడా అత్యధిక తీర ప్రాంతం గల రాష్ట్రమే. మరి గోవా కి మాత్రమే అంతగా టూరిస్టులు ఎందుకు వస్తారంటే ఇక్కడ నీరెండ ఎక్కువ. అదే ఏపీ సన్ రైజింగ్ స్టేట్ కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువ. దానికి తోడు గోవా స్థానికులు సైతం విదేశీ జీవన శైలిని ఏమంత అభ్యంతర పెట్టరు. నడిరోడ్డుపై శృంగారం మద్య మాంసాదుల సేవనం ఇంకా ఎన్నో విదేశీ లైఫ్ స్టైల్ ని ఇక్కడి ప్రజలు పట్టించుకోరు. అయితే గోవాపై బీజేపీ పట్టు పెరిగాక.. ఇక్కడ తరచూ నిరసనలు ఆందోళనలు పెట్రేగడమే విదేశీ టూరిస్టుల రాకడ గణనీయంగా తగ్గడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు.
ఉన్న సమస్యలు చాలవన్నట్టు ఇలాంటి సిలిండర్ పేలుడు ఘటనలకు సంబంధించిన వార్తలు సైతం గోవా టూరిజాన్ని మరింత దెబ్బ తీసేలా తెలుస్తోంది. శనివారం (డిసెంబర్ 6)అర్థరాత్రి ప్రమాదం జరిగినప్పుడు నైట్‌క్లబ్‌లో సుమారు 100 మంది వరకూ ఉన్నారని, సిలెండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మంటలు చెలరేగగానే పలువురు గ్రౌండ్ ఫ్లోర్ వైపు పరుగులు తీశారని, ప్రవేశద్వారం ఇరుకుగా ఉండటంతో కొందరు వంటగదిలోనే చిక్కుకుపోయారని తెలుస్తోంది. మృతుల్లో నలుగురు టూరిస్టులు, 14 మంది సిబ్బంది ఉన్నట్టు చెబుతున్నారు పోలీసులు.