ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు షాక్
posted on Dec 8, 2025 2:26PM

ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆమెను ఏపీకి బదిలీచేస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులను ఆమె క్యాట్‌లో సవాల్ చేశారు. దీంతో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని డీవోపీటీ వాదించింది. హరికిరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని వివరించింది. ఈ క్రమంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.