నాంపల్లి కోర్టు నుంచి జగన్ ఎక్కడకు వెడతారో తెలుసా?!
posted on Nov 19, 2025 11:45AM
.webp)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం (నవంబర్ 20) తన అక్రమాస్తుల కేసు విచారణకు నాంపల్లి కోర్టులో హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఆయన తాడేపల్లి నుంచి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేంగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. ఆయన కోర్టులో గంట సేపు ఉంటారు. ఈ మేరకు జగన్ వ్యక్తిగత సిబ్బంది జగన్ నాంపల్లి కోర్టు హాజరుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. నాంపల్లి కోర్టు నుంచి ఆయన నేరుగా హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ నివాసానికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు విశ్రాంతి తీసుకుని అక్కడ నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెడతారు.