హిడ్మా అనుచరుడు రావులపాలెంలో అరెస్ట్
posted on Nov 19, 2025 12:00PM

కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలో వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు.. వాటికి సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మావోయిస్టుల అరెస్టులు కలకలం సృష్టిస్తున్నాయి.
విజయవాడ, ఏలూరు, కాకినాడ, అమలాపురంలలో జరిపిన సోదాలలో మంగళవారం (నవంబర్ 18) ఏకంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు, బుధవారం ఉదయం అమలాపురం కు సమీపంలో ఉండే రావులపాలెంటో హిడ్మా అనుచరుడి మధవిహండా సరోజ్ ను అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన సరోజ్ రావులపాలెంలో ఏం చేస్తున్నాడన్న కోణంలో అతడిని విచారిస్తున్నారు.
ఆపరేషన్ కగార్ తో వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాటులతో ఉక్కిరిబిక్కిరి అయిన మావోయిస్టులు షెల్టర్ కోసం ఏపీని ఎంచుకున్నారా? ప్రణాళిక మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తలదాచుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.