ఐపీఎస్ పాలిటిక్స్.. సునీల్ ఆంతర్యమేంటి?

ఐపీఎస్ అధికారిగా ఉంటూ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన కామెంట్లు చేయడం ఎంత వరకూ సమంజసం? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.  ఈ విషయంలో.. మాజీ సీఐడీ బాస్ పీవీసునీల్ కుమార్ ఒక ప్రశ్నగా నిలుస్తున్నారు. విధినిర్వహణలో అవకతవకలు, అక్రమాల ఆరోపణలతో ఐపీఎస్ సునీల్  ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.  ఏ అధికారైనా సరే సస్పెన్షన్ లో ఉన్న సమయంలో  తనపై ఉన్న అభియోగాలు, ఫిర్యాదులను కానీ క్లియర్ చేసుకుని సత్ప్రవర్తనను రుజువు చేసుకోవాలి. కానీ ఐపీఎస్ సునీల్ రూటే సెపరేటు. ఆయన సస్పెన్షన్ సమయంలో కూడా తన సంచలన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. ఇంతకీ సునీల్ ఏం చేశారంటే.. కులాల కార్చిచ్చు రగిల్చేలా వ్యాఖ్యలు చేశారు.   కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావాలి,   ఉప ముఖ్యమంత్రిగా దళితుడు ఉండాలి అంటూ ఐపీఎస్ సునీల్ చేసిన వ్యాఖ్యలను బట్టే ఆయన మైండ్ సెట్ ఏమిటన్నది అవగతమౌతుంది.  కాపులే సీఎంలు కావడమేంటి? దళితుడు ఎందుకు కారాదు? అని ఆయన సామాజిక వర్గం నేతలే ఇప్పుడు సునీల్ ను నిలదీస్తున్నారు. 
ఇప్పటికే తమ సామాజిక వర్గానికి చెందిన హర్షకుమార్, జడశ్రవణ్, విజయ్ కుమార్ వంటి వారు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. వారిలో ఒకర్ని ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎంగా ఉండే విధంగా చూడాలన్నారు. రెండేళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రితో మనకు అనవసరమని అన్నారు.

అయినా ఒక ఎంపీపై కస్టోడియల్ టార్చర్ చేసిన ఐపీఎస్ సునీల్ కుమార్ ఇలాంటి కామెంట్లు కాక మరెలాంటి వ్యాఖ్యలు చేస్తారు?  అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజనులు విమర్శలు గుప్పి స్తున్నారు. దళితవాడలను పంచాయితీలను చేయాలన్న తన డిమాండ్ కోసం ఎమ్మెల్యే టికెట్టే నిరాకరించానంటూ సునీల్ ఫక్తు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు.  జగనన్న చెప్పింది చేసినందుకు నందిగం సురేష్ లా సునీల్ ఏదైనా ఆశిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా సివిల్ సర్వీసుల్లో ఉండి ఇలాంటి పొలిటికల్ కామెంట్లు చేయడం కరెక్టు కాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu