ఇంటి అప్పు తీర్చిన అభయప్రదాత.. బాబు

చంద్ర‌బాబు ఫించ‌న్ పంపీణీ   కార్య‌క్ర‌మంతో స్వయంగా పాలుపంచుకుని లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి అందజేస్తున్న చంద్రబాబు.. ఆ సందర్భంగా వారి కష్టాలను వింటున్నారు. వాటిని తీర్చడానికి తన వంతు సహాయం చేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు.   ఆయ‌న ఏ ఇంటికి ఆ ఒక‌టో తారీఖున వెళ్తారో ఆ ఇంటి వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైపోయినట్లే అనడంలో సందేహం లేదు.  కొండకొచో వారి జీవిత కాల సమస్యలకు కూడా చిటికెలో పరిష్కరించేస్తున్నారు. 
గతంలో అంటే వైసీపీ హయాంలో వాలంటీర్లు తెల్లవారకుండానే తలుపుతట్టి మరీ పింఛన్లు అందజేసేవారిని జగన్ సర్కార్ గప్పాలు కొట్టుకునేది.  అది ఏ మేరకు వాస్తవమో తెలియదు కానీ, పింఛన్లలోనూ ముడుపులు దండుకునే వారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

సరే అది పక్కన పెడితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ జనానికి ముఖం చూపిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ఏ బటన్ నొక్కుడు కార్యక్రమానికో రోడ్డు కిరువైపులా పరదాలు కట్టి సభా స్థలికి వచ్చే ఆయన ప్రసంగాలు చేసే వారే కానీ ప్రజల వినతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయన నిత్యం ప్రజలతో మమేకమౌతున్నారు. వారి సమస్యలు వింటున్నారు. పరిష్కరిస్తున్నారు. స్వయంగా ఆయన ఒక లబ్ధిదారు ఇంటికి వెళ్లి మరీ పింఛను అందిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 1) ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో నాగలక్ష్మి అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పింఛను అందజేశారు. వారి యోగక్షేమాలు విచారించారు. సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు.  ఆ ఇంట్లో చ‌దువుకుంటున్న యువ‌కుడు, చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేసిన యువ‌తికి సంబందించిన వివ‌రాలను తెలుసుకుని,  ఆ యువ‌కుడికి టీసీఎస్ లో జాబ్ కోసం సిఫారసు చేస్తానన్నారు. అలాగే  చ‌దువు ఆపేసిన  యువ‌తిని హైబ్రిడ్ ప‌ద్ధ‌తిలో తిరిగి ఎలా చ‌దువుకోవాలో సూచించారు.

ఇక ల‌బ్దిదారు నాగ‌ల‌క్ష్మికి సంజీవ‌నీ ప‌థ‌కం ద్వారా ఎలాంటి ఆహారం అందించాలో సూచించారు. అక్కడితో ఆగలేదు.. నాగలక్ష్మి ఇంటి నిర్మాణం కోసం ఎంత ఖర్చు అవుతుందో ఆరా తీసి.. వారికి ఉన్న అప్పు ఎంతో తెలుసుకుని ఆ మొత్తాన్ని తీర్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడికక్కడే కలెక్టర్ ను ఆదేశించారు. దీంతో నాగలక్ష్మి కుటుంబం అప్పు మొత్తం తీరిపోయింది. సమస్యలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో, ప్రజా నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు ఆచరణలో చూపుతున్నారంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu