ఎక్స్ సేవలకు అంతరాయం

 ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' సేవలకు అంతరాయం కలిగింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న ఎక్స్ మరోసారి  మొరాయించింది. శుక్రవారం (జనవరి 16) సాయంత్రం  ఎక్స్ సేవలు నిలిచిపోవడంతో  ప్ర ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్  సేవలు కొద్ది సేపు నిలిచిపోయాయి. కంటెంట్ డెలివరీ, భద్రతా సేవలు అందించే క్లౌడ్‌ఫ్లేర్ సంస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యలే ఈ అంతరాయానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. అయితే, ఈ అంతరాయంపై ఎక్స్ యాజమాన్యం గానీ, ఎలాన్ మస్క్ గానీ  అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలా ఉండగా వారం వ్యవధిలో ఎక్స్ సేవలకు అంతరాయం కలగడం ఇది రెండో సారి.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu