గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం (జనవరి 17)  కాకినాడలో  పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా వారు  రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా చెబుతున్న ప్రతిష్ఠాత్మక  గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు.

గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ  13 వేల కోట్ల రూపాయల వ్యయంతో  ఈ ప్రాజెక్టును చేపడుతోంది. కాకినాడలో సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఏడాదికి  మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభం కానున్న ఈ పరిశ్రమను, భవిష్యత్తులో 1.5 మిలియన్ టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.  

ఎటువంటి కర్బన ఉద్గారాలు లేకుండా అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతతో ఇక్కడ ఇంధన ఉత్పత్తి జరుగుతుంది. పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా  ప్రత్యక్షంగా, పరోక్షంగా పాతిక  వందల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu