సంక్రాంతి హీరో.. హ్యాట్రిక్ కొట్టిన శర్వానంద్!
on Jan 17, 2026

ఈ సంక్రాంతికి పెద్దగా హడావుడి లేకుండా థియేటర్లలో అడుగుపెట్టి.. కంటెంట్ తో సర్ ప్రైజ్ చేసిన సినిమా అంటే 'నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) అని చెప్పవచ్చు. సంక్రాంతి హీరోగా శర్వానంద్ పేరుని ఈ మూవీ మరింత బలంగా నిలిపింది.
ఈ జనరేషన్ లో సంక్రాంతి హీరోగా శర్వానంద్(Sharwanand)కి పేరుంది. స్టార్స్ సినిమాలతో పోటీపడి హిట్ కొట్టడం శర్వాకు అలవాటు. 2016 సంక్రాంతికి 'నాన్నకు ప్రేమతో', 'డిక్టేటర్', 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి 'ఎక్స్‌ప్రెస్ రాజా'తో హిట్ కొట్టాడు. 2017 సంక్రాంతికి 'ఖైదీ నెం.150', 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి బడా సినిమాలతో తలపడి 'శతమానం భవతి'తో సక్సెస్ సాధించాడు. 2026 సంక్రాంతికి కూడా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేశాడు శర్వానంద్. పోటీగా 'ది రాజా సాబ్', 'మన శంకర వరప్రసాద్' వంటి భారీ సినిమాలున్నా.. హ్యాట్రిక్ సంక్రాంతి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
శర్వానంద్ హీరోగా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన మూవీ 'నారీ నారీ నడుమ మురారి'. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా జనవరి 14 సాయంత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్. ఎక్స్-గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే వ్యక్తిగా శర్వానంద్ కనిపించాడు.
ఈ సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్స్ పరంగా తక్కువ హడావుడి చేసింది 'నారీ నారీ నడుమ మురారి'నే. దీంతో ఈ సారి శర్వానంద్ కి షాక్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. కంటెంట్ తో సర్ ప్రైజ్ చేసింది ఈ మూవీ.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా నవ్వించిన 'నారీ నారీ నడుమ మురారి'.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో రోజురోజుకి స్క్రీన్లు, వసూళ్లు పెరిగిపోతున్నాయి. మొదటి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో శర్వానంద్ ఖాతాలో మరో సంక్రాంతి విజయం పడినట్లే.
Also Read: నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



