ఇరాన్ కు ట్రంప్ థ్యాంక్స్

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు ధ్యాంక్స్ చెప్పారు. ఔను నిన్నటి వరకూ ఇరాన్ పై కారాలూ, మిరియాలూ నూరి, దాడి హెచ్చరికలు జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా మెత్తపడ్డారు. ఇరాన్ విషయంలో ఆయన ఒకింత మెత్తబడ్డారు.

అంతే కాదు.. తన మాటకు విలువ ఇచ్చి నిరసనకారుల మరణ శిక్షలను రద్దు చేసినందుకు ఆయన ఇరాన్ కు ధన్యవాదాలు తెలిపారు. తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా, ఇరాను తన మాటకు విలువనిచ్చి దాదాపు ఎనిమిది వందలకు పైగా ఉరిశిక్షలను రద్దు చేసిందని పేర్కొన్న ట్రంప్, ఇరాన్ నాయకత్వానికి కృతజ్ణతలు తెలిపారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu