గ్రీన్ లాండ్ ను ఆక్రమిస్తాం.. వ్యతిరేకించే వారిపై అదనపు సుంకాలు విధిస్తాం!

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో సారి టారిఫ్ వార్ ప్రకటించారు. తమ ఆక్రమణలను అడ్డుకుంటే అదనపు సంకాలను విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.  ఔను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మరోసారి టారిఫ్  హెచ్చరికలు చేశారు. గ్రీన్ లాండ్   విషయంలో తమతో విభేదించే దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానని హుంకరించారు.

  అమెరికా జాతీయ భద్రత విషయంలో గ్రీన్ లాండ్ అత్యంత కీలకమన్న ట్రంప్  ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని తీరుతామని, ఈ విషయంలో తమను వ్యతిరేకించేవారెవరైనా సరే సహించేది లేదని ప్రపంచ దేశాలకు ట్రంప్ అల్టిమేటమ్ ఇచ్చారు.  అయితే టంప్ చేసిన ఈ వార్నింగ్ డెన్మార్క్ కు మాతర్మేనని పరిశీలకులు అంటున్నారు.

ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ ను ఆక్రిమించుకుంటామన్న ట్రంప్  తీరును డెన్మార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  డెన్మార్క్ ఎప్పటికీ తమ అధీనంలోని స్వతంత్రదేశాంగానే ఉంటుందని  డెన్మార్క్ అధ్యక్షుడు మెట్టె ఫ్రెడెరిక్సన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వార్నింగ్ డెన్మార్క్ కేనని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu