ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు కీలక నేత పాపారావు హతం

ఛత్తీస్‌గఢ్ లోని  బీజాపూర్ జిల్లాలో  జరిగిన ఎన్ కౌంటర్ లో  మావోయిస్టు పార్టీ అగ్రనేత  పాపారావు హతమయ్యాడు. ఈ ఘటనతో   బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టైంది.  అత్యంత విశ్వసనీయంగా అందిన  సమాచారం మేరకు, గత కొన్ని రోజులుగా పాపారావు నేషనల్ పార్క్ పరిసర అటవీ ప్రాంతంలో దాక్కుని ఉన్నాడని తెలుసుకున్న భద్రతాదళాలు కూంబింగ్ చేపట్టాయి.   డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , స్పెషల్ టాస్క్ ఫోర్స్, మరియు కోబ్రా ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కూబింగ్ లో తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో  ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత పాపారావు అక్కడికక్కడే  మరణించాడు.  

సంఘటనా స్థలం నుంచి  రెండు ఏకే–47 తుపాకులు,  మందుగుండు సామగ్ర, మావోయిస్టు సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.  పాపారావు మావోయిస్టు పార్టీలో  కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, భద్రతా బలగాలపై దాడులు, ఆయుధాల సరఫరా, కొత్త క్యాడర్ నియామకం వంటి కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.  ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎఇంకా మావోయిస్టులు అనుమానంతో  భద్రతా బలగాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu