తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని

 

భారత తొలి వందే భారత్ స్లీపర్ రైలును  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌‌లోని మాల్దాలో ప్రారంభించారు. హౌరా-గువాహటి మధ్య ఈ రైలు నడవనుంది. 16 బోగీలు, 823 మంది ప్రయాణికులతో సుమారు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వేగం, సురక్షితం, మరిన్ని సదుపాయాలతో సుదూర ప్రయాణాలను సాగించనుంది. 

టికెట్ ధరలు రూ.2,300-3,600 మధ్య నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు రైళ్లు, రోడ్డు ప్రాజెక్టులను.. ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మాల్దాలో జరుగనున్న బహిరంగ సభలో రూ.3,250 కోట్ల విలువ చేసే రైల్, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు. కాగా.. మోడ్రన్ ఇండియాలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో వందే భారత్ స్లీపర్ రైలును డిజైన్ చేశారు. మేక్‌ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లోనే వీటి డిజైన్, తయారీ చేపడుతున్నారు. జనవరి 18న హుగ్లీ జిల్లాలోని సింగూరు వద్ద రూ.830 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభింస్తారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu