ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కే తొలి ప్రాధాన్యత : సీఎం రేవంత్‌రెడ్డి

 

దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని, తానూ కూడ ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కే పెద్దపీట వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, చిట్టబోయినపల్లిలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు.  బూర్గుల రామకృష్ణా రావు తరవాత మహబూబ్ నగర్ జిల్లాకు 75 ఏళ్లకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని..అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పాలమూరు జిల్లాకు విద్యా, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు  ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం తెలిపారు. 

విద్యా మన సమస్యలకు పరిష్కారం చూపుతుంది...భాషను మెరుగు పరుచు కోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రి కాకపోయినాఅందరి సహకారంతో సీఎం అయ్యాని తెలిపారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఇప్పటికీ ప్రజలకు జీవనాధారమై ఉన్నాయని తెలిపారు. గతంలో భూస్వాములు, దొరల వద్ద లక్షలాది ఎకరాలు ఉండేవని, భూగరిష్ఠ పరిమితి చట్టం తీసుకువచ్చి మిగులు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిందని గుర్తుచేశారు. 

కానీ ఇప్పుడు పేదలకు పంచేందుకు ప్రభుత్వానికి భూమి లేదని, అందుకే మంచి విద్య ఇవ్వడమే తమ ముందున్న ప్రధాన బాధ్యత అని సీఎం చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందని, నిబద్ధత లేని చదువుతో ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహా, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu