పురుషులకు ఫ్రీ బస్...ఏఐడీఎంకే మేనిఫెస్టోలో ప్రకటన

 

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏఐడీఎంకే పార్టీ  తొలి విడత  మేనిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతినెలా రూ. 2 వేలు, సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం..ఇళ్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ. 25 వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించారు. 

తమిళనాడు ఇప్పటికే అప్పుల్లో ఉండగా ఇన్ని ఉచిత పథకాలు ఎలా సాధ్యమని మీడియా ప్రశ్నించగా.. పళనిస్వామి అందుకు ధీటుగా స్పందించారు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వానికి పరిపాలనా దక్షత లేదని. తాము అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపినట్లు తెలిపారు. సరైన ప్రణాళిక, పరిపాలనా సామర్థ్యం ఉంటే ఇవన్నీ సాధ్యమేనని అని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాము రూ. 1,500 ఇస్తామని చెబితే, డీఎంకే దాన్ని కాపీ కొట్టిందని, కానీ ఇప్పుడు తాము మరింత మెరుగైన పథకాలతో ప్రజల ముందుకు వస్తున్నామని పళనిస్వామి వెల్లడించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu