సత్తా చాటిన భారత మహిళలు.. ఒకే ఏడాది నాలుగు ప్రపంచ కప్పులు
posted on Nov 26, 2025 8:36AM
.webp)
ఈ మధ్య కాలంలో భారత్ క్రీడాకారులు, మరీ ముఖ్యంగా మహిళా జట్లు అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. 2025 భారత మహిళా జట్లు ప్రంపంచ స్థాయిలో నంబంర్ వన్ గా నిలిచాయనడానికి ఆ జట్లు సాఆధించిన నాలుగు వరల్డ్ కప్ లే నిదర్శనం. తొలుత అండర్ 19 విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ తో మోదలైన భారత మహిళల విజయపరంపర.. 2025 విమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది.
సుమారు యాభై ఏళ్ల సుదీర్ఘమైన నిరీక్షణకు తెర దించితూ వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది టీమ్ ఇండియా మహిళల జట్టు. ఇదే గొప్ప అనుకుంటే, బధిరుల మహిళా ప్రపంచ కప్ సైతం గెలిచి భళిరా! భారత మహిళ.. అనిపించారు. తాజాగా భారత మహిళా కబడ్డీ జట్టు సైతం ప్రపంచ కప్ గెలిచి భారత మహిళలకు క్రీడా ప్రపంచంలో తిరుగే లేదనిపించారు. భారత మహిళల జట్లు ఇప్పుడు అన్ బీటబుల్ గా మారాయని క్రీడా లోకం కోడై కూస్తోంది. భారత మహిళలూ మీరు భేష్! అంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.