దక్షిణాఫ్రికా చేతిలో టీమ్ ఇండియా వైట్ వాష్
posted on Nov 26, 2025 1:33PM

సొంత గడ్డపై టీమ్ ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికాతో గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలి టెస్టులో కూడా టీమ్ ఇండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను 0-2తో చేజార్జుకుని దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది.
బుధవారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగులు చేసింది. ప్రతిగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి260 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా బొక్కబోర్లా పడింది. కేవలం 140 పరు గులకే ఆలౌట్ అయ్యి 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.