భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. వైద్య ఆరోగ్య రంగాల్లో ఆహార భద్రత,లేబర్‌ మైగ్రేషన్‌ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంపై ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలు ప్రధాని మోదీ, పుతిన్ సమక్షంలో నిర్వహించారు. వీటితో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.శుక్రవారం ఉదయం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో పుతిన్, మోదీ భేటీ అయ్యారు. 

రెండు రోజుల పర్యటన కోసం గురువారమే భారత్‌కు చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో ఘనస్వాగతం పలికారు. భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శుక్రవారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. 

గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పుతిన్ వెంట కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu