రగ్బీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన సోమిరెడ్డి
posted on Nov 30, 2025 10:35AM

నెల్లూరు జిల్లా పొదలకూరులో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ అండర్ -17 బాలుర విభాగంలో నెల్లూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ప్రకాశం, నెల్లూరు జట్లు తలపడగా నెల్లూరు జట్టు విజేతగా నిలిచింది. రన్నర్ గా ప్రకాశం జిల్లా జట్టు గెలుపొందింది. అలాగే అండర్-17 బాలికల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది.
రన్నర్ గా గుంటూరు జిల్లా జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో తూర్పుగోదావరి, గుంటూరు జట్లు హారహోరిగా తలపడ్డాయి. చివరకు తూర్పుగోదావరి విజేతగా నిలిచింది. విజేతలకు శనివారం సాయంత్రం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది తన సొంత నిధులతో నగదు బహుమతులను అందజేశారు.