ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఉన్నత స్థాయి సలహామండలి
posted on Nov 25, 2025 12:03PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య రక్షణ లక్ష్యంగా సీఎం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా చర్యలు ఆరంభమయ్యాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మేరకు 2047 నాటికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. అందుకే ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు పది మందితో ఉన్నత స్థాయి సలహా మండలిని నియమించింది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 24) అధికారిక ప్రకటన వెలువడింది. అత్యధికంగా ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న 10 వ్యాధులకు సంబం ధించి ఒక్కో వ్యాధికి అడ్వయిజరీ గ్రూపు ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతికతో మెరుగైన వైద్య సేవల్ని అందించడానికి గేట్స్ ఫౌండేషన్, టాటా ఎండి, ఐఐటి చెన్నై స్వస్థి వంటి సంస్థల భాగస్వామ్యంతో ప్రణాళికలు అమలవుతున్నాయి. వీటితో పాటు పలు ఇతర కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న ఆరోగ్య పథకాలూ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రణాళికల అమలు, ఫలితాలను సమీక్షిస్తూ ఆరోగ్యాంధ్ర సాధన దిశగా ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి 10 మంది అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన సలహామండలి ఏర్పాటైంది. ఈ సలహా మండలి విజన్-2047 మేరకు రాష్ట్ర ప్రజలకు పూర్తి ఆరోగ్యం, ఆహ్లాదం కల్పిం చేందుకు సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేస్తుంది. అలాగే మాతాశిశు ఆరోగ్య పరిరక్షణ, అసంక్రమిక వ్యాధుల నిర్మూలనకు అవసరమైన మార్గాలను సూచిస్తుంది. ఇంకా వివిధ వివిధ పధకాల సమ న్వయం కోసం చేపట్టాల్సిన చర్యల్నిసూచిస్తుంది. అలాగే రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ హెల్త్ హబ్ గా రూపొందించడానికి అవసరమై సూచనలు, సలహాలు ఇస్తుంది. ఈ సలహామండలి మొదటి సమావేశం డిసెంబర్ లో జరగనుంది. ఆ తొలి సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు.