హిడ్మా ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్సీలో ఫిర్యాదు
posted on Nov 25, 2025 1:07PM

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్ కౌంటర్ బూటకమంటూ జాతీయ మానవహక్కుల పరిరక్షణ సంఘం (ఎన్ హెచ్ ఆర్సీ)లో ఫిర్యాదు నమోదైంది. హిడ్మా ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ హెచ్ ఆర్సీని విజయ్ కిరణ్ అనే న్యాయవాది ఆశ్రయించారు. హిడ్మాది ఫేక్ ఎన్ కౌంటర్ అని తన ఫిర్యాదులో పేర్కొన్న న్యాయవాది హిడ్మా ఎన్ కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సి మార్గదర్శకాల మేరకు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదనీ. తటస్థ అధికారుల ద్వారా దర్యాప్తు జరగలేదనీ ఆయన పేర్కొన్నారు. హిడ్మా ఎన్ కౌంటర్ లో నిజానిజాలు తెలియాల్సి ఉందని పేర్కొన్న విజయ్ కిరణ్.. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వాస్తవ సమాచారం ప్రజలకు వెల్లడించాలన్నారు. మావోయిస్టులైనా, పోలీసులైనా ఎవరు చేసినా చట్టాన్ని చేతుల్లోకి తీసు కోవడం నేరమేనని పేర్కొన్న ఆయన హిడ్మా ఎన్ కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు.