ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం
posted on Nov 27, 2025 2:49PM

ఇండోనేసియాలో మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. భూమికి పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప తీవ్రత ఉంది. సమత్రా దీవిలోని ఏస్ ప్రావిన్స్ సమీపంలో సంభవించిన ఈ భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు.
అలాగే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అయితే కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ఏస్ ప్రావిన్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉండటం వల్ల ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభ విస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తతం వచ్చిన ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రమాదం లేదనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.