తెలంగాణ ఎఫెక్ట్: డిఐజి రాజీనామ

 

 DIG Iqbal resigns, DIG Iqbal resigns over rayala seema division

 

 

కేంద్ర తెలంగాణ‌కు అనుకూలంగా సంకేతాలు ఇస్తున్న నేప‌ధ్యంలో ఇప్పుడు త్యాగాలు చేయ‌డం సీమాంద్ర ప్రజ‌ల వంతు అయింది.. గతంలో ఓ మ‌హిళ డిఎస్పీ రాజీనామ చేయ‌టం అప్పట్లో సంచ‌ల‌నం సృష్టించింది..ఇప్పుడు మ‌రోసారి అంలాటి రాజీనామనే తెర మీద‌కు వ‌చ్చింది.రాష్ట్ర విభ‌జ‌న‌ను నిర‌సిస్తూ డిఐజి ఇక్బాల్ రాజీనామ చేశారు.

 

తెలంగాణ పై నిర్ణయం తీసుకునే క్రమంలో భాగంగా రాయ‌ల‌సీమ‌ను విభ‌జించే ప్రయ‌త్నం కేంద్రం చేస్తుండ‌టంతో అందుకు నిర‌స‌న‌గా ఇక్బాల్ రాజీనామ చేశారు. సిన్సియ‌నర్ ఆఫీస‌ర్‌గా మంచి పేరున్న ఇక్బాల్‌కు ఇంకా 5 సంవ‌త్సరాల‌కు పైగా ప‌ద‌వీ కాలం మిగిలే ఉంది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన ఇక్బాల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవ‌టం అంద‌రిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu