భార్యా బిడ్డల హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష

వికారాబాద్  హత్యల కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో కోర్టు నిందితుడు ప్రవీణ్ కుమార్ కు ఉరిశిక్ష విధిస్తూ గురువారం (నవంబర్  22) తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెడితే.. 

వికారాబాద్ పట్టణంలో  ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించే ప్రవీణ్ కుమార్ కు అప్పటికే పెళ్లై ఒక కొడుకు ఉన్న మహిళతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.  దీంతో వారివురూ వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప జన్మించింది. అయితే వివాహం తరువాత ప్రవీణ్ కుమార్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు.  

2019 ఆగస్టు 5 రాత్రి పీకలదాకా మద్యం సేవించిన ప్రవీణ్ కుమార్ ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. గొడవ పెద్దదవ్వడంతో ఆగ్రహానికి లోన ప్రవీణ్ కుమార్  ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ తో భార్య మరియు ఐదేళ్ల కుమార్తెను  కొట్టి హతమార్చాడు. అనంతరం 9 ఏళ్ల కుమారుడని గొంతు నులిమి హత్య చేశాడు. భార్యా పిల్లలను హత్య చేసిన అనంతరం  పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్య మొబైల్లో మెసేజీలు  చూసి  అనుమానం పెంచుకుని భార్య పిల్లలను హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది.   పోలీసులు సాక్ష్యాధారాలు లను సేకరించి కోర్టులో సమర్పించారు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపి నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu